Type Here to Get Search Results !

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా - Nee Premaa Nee Karunaa - Telugu Christian Song Lyrics

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా - Dr Satish Kumar- Telugu Christian Song Lyrics

Singer Dr Satish Kumar

నీ ప్రేమా నీ కరుణా చాలునయ్యా నా జీవితాన
మరి దేనిని ఆశించను నే కోరను ఈ జగాన
చాలయ్య చాలీ దీవెనలు చాలు
మేలయ్య మేలు నీ సన్నిధి మేలు (2)

గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే ||నీ ప్రేమా||

చేజారిన నాకై చేచాచినావే
చెదరిన నా బ్రతుకును చేరదీసినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని నీ ప్రేమకు సాక్షిగ మార్చావే ||నీ ప్రేమా||

నరకపు పొలిమేరలో నను కనుగొన్నావే
కల్వరిలో ప్రాణమిచ్చి నను కొన్నావే
నీ ప్రేమను ప్రకటింప నను ఎన్నుకొన్నావే
నీ కుమారునిగా నను మార్చినావే ||నీ ప్రేమా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area