ఏ యోగ్యత లేని నన్ను - S P Balu Telugu Christian Songs Lyrics
Singer | S P Balu |
ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా (2)
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును (2) ||ఏ యోగ్యత||
కలిషుతుడైన పాపాత్ముడను నిష్కళంకముగా నను మార్చుటకు (2)
పావన దేహంలో గాయాలు పొంది (2)
రక్తమంత చిందించినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును (2) ||ఏ యోగ్యత||
సుందరమైన నీ రూపమును మంటివాడనైన నా కియ్యుటకు (2)
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేలాడి (2)
నీ సొగసును కోల్పోయినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును (2) ||ఏ యోగ్యత||
పాపము వలన మృతినొందిన అపరాధినైన నను లేపుటకు (2)
నా స్థానమందు నా శిక్ష భరించి (2)
మరణించి తిరిగి లేచినావా
నీకేమి చెల్లింతును నీ ఋణ మెలా తీర్తును (2) ||ఏ యోగ్యత||