నన్నెంతగా ప్రేమించితివో - Nissy John, KY Ratnam | Praise and Worship Song Lyrics
Singer | Nissy John, KY Ratnam |
నన్నెంతగా ప్రేమించితివో
నిన్నంతగా దూషించితినో
నన్నెంతగా నీవెరిగితివో
నిన్నంతగా నే మరచితినో
గలనా – నే చెప్పగలనా
దాయనా – నే దాయగలనా (2)
అయ్యా… నా యేసయ్యా
నాదం – తాళం – రాగం
ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||
ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||