Type Here to Get Search Results !

నన్ను గన్నయ్య రావె నా యేసు | Nannu Gannayya Raave | Andhra Christava Keerthanulu Song Lyrics

నన్ను గన్నయ్య రావె నా యేసు | Andhra Christava Keerthanulu Song Lyrics

Singer Padma

నన్ను గన్నయ్య రావె నా యేసు
నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను||

ముందు నీ పాదారవిందము
లందు నిశ్చల భక్తి ప్రేమను (2)
పొందికగా జేయరావే నా
డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను||

హద్దులేనట్టి దురాశల
నవివేకినై కూడి యాడితి (2)
మొద్దులతో నింక కూటమి
వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను||

కాలము పెక్కు గతించెను
గర్వాదు లెడదెగవాయెను (2)
ఈ లోకమాయ సుఖేచ్ఛలు
చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను||

దారుణ సంసార వారధి
దరి జూపి ప్రోవ నీ కన్నను (2)
కారణ గురువు లింకెవ్వరు
లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను||

నా వంటి దుష్కర్మ జీవిని
కేవలమగు నీదు పేర్మిని (2)
దీవించి రక్షింపనిప్పుడే
రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area