Type Here to Get Search Results !

కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై - Kanalenu Prabhukela - Christian Song Lyrics

కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై - Betty Sandesh - Christian Song Lyrics

Singer Betty Sandesh

కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై
మనలేను ప్రభు జూచి కఠినాత్మునై
కఠినాత్మునై… ||కనలేను||

పాపులనేలేటి ప్రభునేలనో
బల్లెంపు పోటుల బంధించిరి (2)
కనుపించు పాపాలు రక్తాలలో
ప్రభు బాధలో ||కనలేను||

ముండ్ల కిరీటము ప్రభుకేలనో
మూఢులు మోపిరి ప్రభు నెత్తిని (2)
ప్రభు రక్త గాయాలు నా పాపమా
ప్రభు శాపమా ||కనలేను||

తన జంపు శత్రువుల క్షమియించెను
క్షమియింపుమని తండ్రిని వేడెను (2)
క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెను
భరియించెను ||కనలేను||

మోయజాలని సిలువ మోయించిరి
దివినేలు బాహువులు బంధించిరి (2)
నా పాపమంతయు ప్రభు మోసెను
భరియించెను ||కనలేను||

జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనో
చేదు చిరక త్రాగను అందించిరి (2)
ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెను
సిలువొందెను ||కనలేను||

తన ఆత్మ తండ్రికి సమర్పించెను
తనదంతా తండ్రితో చాచుంచెను (2)
తలవంచి తండ్రిలో తుది చేరెను
కను మూసెను ||కనలేను||

లోకాలనేలేటి ప్రభువేలనో
ఈ ఘోర మరణంబు గురి అయ్యెనో (2)
నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనో
సిలువేసెనో ||కనలేను||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area