Type Here to Get Search Results !

కనలేని కను లేలనయ్యా - Kanaleni Kanulelanayyaa - Praise and Worship Songs Lyrics

కనలేని కనులేలనయ్యా - Jerusha Rani- Praise and Worship Songs Lyrics

Singer Jerusha Rani

కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)
అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2)
అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)
ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area