Type Here to Get Search Results !

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర - Aananda Yaathra - హోసన్నా మినిస్ట్రీస్ Song Lyrics

ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర - Bro Yesanna- హోసన్నా మినిస్ట్రీస్ Song Lyrics

Singer Bro Yesanna

ఆనంద యాత్ర
ఇది ఆత్మీయ యాత్ర
యేసుతో నూతన
యెరుషలేము యాత్ర
మన.. యేసుతో నూతన
యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర||

యేసుని రక్తము
పాపములనుండి విడిపించెను (2)
వేయి నోళ్ళతో స్తుతించినను
తీర్చలేము ఆ ఋణమును (2) ||ఆనంద యాత్ర||

రాత్రియు పగలును
పాదములకు రాయి తగలకుండా (2)
మనకు పరిచర్య చేయుట కొరకై
దేవదూతలు మనకుండగా (2) ||ఆనంద యాత్ర||

కృతజ్ఞత లేని వారు
వేలకొలదిగ కూలినను (2)
కృపా వాక్యమునకు సాక్షులమై
కృప వెంబడి కృప పొందెదము (2) ||ఆనంద యాత్ర||

ఆనందం ఆనందం
యేసుని చూచే క్షణం ఆసన్నం
ఆత్మానంద భరితులమై
ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area