శ్రమనొందినావా ఆ సిల్వలో - Prabhu Bhushan - Latest Telugu Good Friday Song Lyrics
Singer | Prabhu Bhushan |
Music | Bro Ashok M |
Song Writer | Ps.Vinay Kumar |
పల్లవి :
శ్రమనొందినావా ఆ సిల్వలో
మరణించినావా ఆ కల్వరిలో " 2 "
ఏమని వర్ణింతునయ్యా ఆ ప్రేమను
ఏమని వివరింతునయ్యా ఆ త్యాగమును " 2 "
" శ్రమనొందినావా "
1 ) ఘోర పాపినైన నన్ను ప్రేమించినావా
నాకలుషమెల్ల భాపను సిలువను మోసావా " 2 "
నిందించినా పిడిగుద్దులు గుద్దినా
మౌనముగా భరియించినావా " 2 "
నన్నెంతో ప్రేమించినావా
నాకొరకే భరియించినావా " 2 "
ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ సిలువ ప్రేమ
ఇది కలువరి ప్రేమ " శ్రమనొందినావా "
2 ) ముఖముపైన ఉమ్మిన నాకై ఓర్చితివా
హేళన చేసినను నాకై సహియించితివా"2"
దూషించినా నోరు తెరువకుంటివా
నా కొరకే భరియించినావా " 2 "
నన్నెంతో ప్రేమించినావా
నాకొరకే భరియించినావా " 2 "
ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ
ప్రేమ ప్రేమ సిలువ ప్రేమ
ఇది కలువరి ప్రేమ " శ్రమనొందినావా "