మధురమైనది నా యేసు ప్రేమ - Madhuramainadhi na yesu prema lyrics -Telugu Christian Songs Lyrics
Singer | Sharon,Lillian & Hana Joyce |
Music | JK Christopher |
Song Writer | Ps Devadas |
పల్లవి :
మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ
మరువలేనిది నా యేసుని ప్రేమ
మధురాతిమధురన్ నా ప్రియుని ప్రేమా ॥
ప్రేమా.....ప్రేమా.....ప్రేమా..... నా యేసు ప్రేమా || మధుర ||
చరణం1.
ఇహలోక ఆశాలతో అంధుడనేనైతిని - నీ సన్నిధి విడిచి నీకుదూరమైతిని
చల్లని నీ స్వరముతో నన్ను నీవు పిలిచి
నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం
ప్రేమా.... ప్రేమా.... ప్రేమా.... నా యేసు ప్రేమా || మధుర ||
చరణం2.
నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి - మరణపు ముల్లును విరిచిన
జీవము నొసగిన నీ ప్రేమ మధురం
ప్రేమా.... ప్రేమా.... ప్రేమా.... నా యేసు ప్రేమా || మధుర ||