Type Here to Get Search Results !

కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము - kalavantidhi ne jivitamu kadu swalpa kaalamu - Telugu Christian songs Lyrics

కలవంటిది నీ జీవితము కడు స్వల్ప కాలము - Telugu Christian songs Lyrics

Singer Unknown

కలవంటిది నీ జీవితము
కడు స్వల్ప కాలము
యువకా అది ఎంతో స్వల్పము (2)
విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువకా వ్యర్ధము చేయకుము
బహు విలువైనది నీ జీవితం
వ్యర్ధము చేయకుము
యువతీ వ్యర్ధము చేయకుము ||కలవంటిది||

నిన్ను ఆకర్షించే ఈ లోకము
కాటు వేసే విష సర్పము
యువకా అది కాలు జారే స్థలము (2)
ఉన్నావు పాపపు పడగ నీడలో
నీ అంతము ఘోర నరకము
యువకా అదియే నిత్య మరణము (2) ||కలవంటిది||

నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం
నూతన సృష్టిగా మార్చును
పాపం క్షమియించి రక్షించును (2)
ఆ మోక్షమందు నీవుందువు
యుగయుగములు జీవింతువు
నీవు నిత్యము ఆనందింతువు (2) ||కలవంటిది||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area