ప్రార్ధన వినెడి పావనుడా | Praardhana Vinedi Song Lyrics | Telugu Old Christian Song Lyrics
Singer | Unknown |
Composer | Ashirwad Luke |
Music | Unknown |
Song Writer | K.WILSON |
పల్లవి: ప్రార్ధన వినెడి పావనుడా – ప్రార్ధన మాకు నేర్పుమయా
శ్రేష్టమైన భావము గూర్చి – శిష్య బృందముకు నేర్పితివి
పరముడ నిన్ను ప్రణుతించెదను – పరలోక ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన వినెడి||
చరణం1. పరమ దేవుడవని తెలిసి – కరములెత్తి జంటగ మోడ్చి
శిరమును వంచి సరిగను వేడిన – సుంకరి ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన వినెడి||
చరణం2. దినదినంబు చేసిన సేవ – దైవచిత్తముకు సరిపోవ
దీనుడవయ్యు దిటముగ కొండను – చేసిన ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన వినెడి||
చరణం3. శత్రుమూక నిను చుట్టుకొని – సిలువ పైన నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ – సలిపిన ప్రార్ధన నేర్పుమయా ||ప్రార్ధన వినెడి||