Type Here to Get Search Results !

కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ - Kanuchupu Meralona Ye Aasha

కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ - Dr. A.R. Stevenson Lyrics

Singer Dr. A.R.Stevenson
Composer Dr. A.R.Stevenson
Music Dr. A.R.Stevenson
Song Writer Dr. A.R.Stevenson

పల్లవి:
నేనున్నా నీతో అంటూ
నా చెంతకు చేరావు
యేసయ్యా.. యేసయ్యా…

చరణం1.
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)

చరణం2.
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)
పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)

చరణం3.
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2)
స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)

చరణం4.
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2)
అడుగేసి సాగగ అనువుకాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2)
||కనుచూపు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area