Type Here to Get Search Results !

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను | Aaradhanaku Yogyudaa

ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను - Ps.Jyothi Raju - aradhana telugu christian songs lyrics

Singer Ps.Jyothi Raju
Composer Ps.Jyothi Raju
Music Ps.Jyothi Raju
Song Writer Ps.Jyothi Raju

పల్లవి:
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ మేలులకై ఆరాధన – నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)

చరణం1.
దినమెల్ల నీ చేతులు చాపి
నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
ఆరాధన ఆరాధన (2)
నీ ప్రేమకై ఆరాధన – నీ జాలికై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)

చరణం2.
ధనవంతులుగా చేయుటకు
దారిద్య్రత ననుభవించినావు (2)
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా
పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ కృప కొరకై ఆరాధన – ఈ స్థితి కొరకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2) ||ఆరాధనకు||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.