గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని - Dr John Wesly | Telugu Christian Songs Lyrics
Singer | Dr John Wesly |
Singer | Dr John Wesly |
Music | Dr John Wesly |
Song Writer | Dr John Wesly |
పల్లవి:
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని
ఈ నింగి నేల కనుమరుగైన శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
చరణం1.
భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్జానమునకు స్పందించాలని
నాకున్నవన్నీ సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో అది ఏ మాటల్లో ఉందో
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని
చరణం2.
అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చిన శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండిన నీదు సిలువను మోయాలని
నా గుండె కోవెలలోన నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని