కన్నీరేలమ్మా కరుణించు యేసు | Kannirelamma Karuninchu Yesu - Samuel Karmoji | Telugu Christian Songs Lyrics

Singer | Samuel Karmoji |
Tune | Samuel Karmoji |
Music | Samuel Karmoji |
Song Writer | Samuel Karmoji |
పల్లవి:
కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా
కరుణ చూపి కలత మాన్పే యేసే తోడమ్మా
చరణం1.
నీకేమి లేదని ఏమి తేలేదని
అన్నారా నిన్ను అవమానపరిచారా
తలరాత ఇంతేనని తరువాత ఏమవునోనని
రేపటిని గూర్చి చింతించుచున్నావా
చింతించకన్న యేసు మాటలు మరిచావా
మారాను మధురంగా మార్చెను చూసావా
చరణం2.
నీకెవరు లేరని ఏంచేయలేవని
అన్నారా నిన్ను నిరాశపరిచారా
పురుగంటి వాడనని ఎప్పటికి ఇంతేనని
నా బ్రతుకు మారదని అనుకుంటూఉన్నావా
నేనున్నానన్న యేసు మాటలు మరిచావా
కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా