నీవు లేని రోజు అసలు రోజే కాదయా | Neevu leni roju song lyrics - Samuel Karmoji | Telugu Christian Songs Lyrics

Singer | Samuel Karmoji |
Tune | Samuel Karmoji |
Music | Samuel Karmoji |
Song Writer | Samuel Karmoji |
పల్లవి:
నీవు లేని రోజు అసలు రోజే కాదయా
నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా ౹౹2౹౹
నీవే లేకపోతే నేనసలే లేనయా ౹౹2౹౹
౹౹నీవు లేని౹౹
చరణం 1:
బాధ కలుగు వేళలో నెమ్మది నా కిచ్చావు
నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు ౹౹2౹
నన్ను విడువనన్నావు నా దేవుడైనావు౹౹2౹౹
నీవే లేకపోతే నేనసలే లేనయా ౹౹2౹౹
౹౹నీవు లేని౹౹
చరణం 2:
ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే
నేను కలిగి యున్నవన్ని నీదు కృపా భాగ్యమే ౹౹2౹౹
నీవు నా సొత్తన్నావు కృపా క్షేమామిచ్చావు ౹౹2౹౹
నీవే లేకపోతే నేనసలే లేనయా౹౹2౹౹
౹౹ నీవు లేని౹౹