కల్వరి ప్రేమను తలంచునప్పుడు - CANDY CELINA GRACE | Telugu Christian Songs Lyrics
Singer | CANDY CELINA GRACE |
Music | PHILIP GARIKI |
Song Writer | REV. HENRY JOSEPH |
పల్లవి:
కల్వరి ప్రేమను తలంచునప్పుడు
కలుగుచున్నది దుఃఖం
ప్రభువా నీ శ్రమలను ధ్యానించునప్పుడు
పగులుచున్నది హృదయం (2)
చరణం:1
గెత్సేమనే అను తోటలో
విలపించుచు ప్రార్ధించు ధ్వని (2)
నలువైపులా వినబడుచున్నది
పగులుచున్నవి మా హృదయములు
కలుగుచున్నది దుఃఖం
మమ్మును నడిపిపంచుము ||కల్వరి||
చరణం:2
సిలువపై నలుగ గొట్టిననూ
అనేక నిందలు మోపిననూ (2)
ప్రేమతో వారిని మన్నించుటకై
ప్రార్ధించిన ప్రియ యేసు రాజా
మమ్మును నడిపించుము ||కల్వరి||
చరణం:3
మమ్మును నీవలె మార్చుటకై
నీ జీవమును ఇచ్చితివి (2)
నేలమట్టుకు తగ్గించుకొని
సమర్పించితివి కరములను
మమ్మును నడిపిపంచుము ||కల్వరి||