Type Here to Get Search Results !

అపరాధిని యేసయ్య… | Aparaadhini Yesayya | Telugu Christian Songs Lyrics

అపరాధిని యేసయ్య - Anwesha Dutta | Good Friday Songs Lyrics

Singer Anwesha Dutta
Music Pranam Kamlakhar
Song Writer Siripurapu Krupanandam

పల్లవి:
అపరాధిని యేసయ్య… కృపజూపి భ్రోవుమయ్యా
అపరాధిని యేసయ్య… కృపజూపి భ్రోవుమయ్యా
నెపమెంచకయే నీ కృపలో… అపరాధములను క్షమించు
అపరాధిని యేసయ్య… కృపజూపి భ్రోవుమయ్యా

చరణం1. ఘోరంబుగా దూరితిని… నేరంబులను జేసితిని
క్రూరుండనై గొట్టితిని… ఘోరంబు పాపిని దేవా ||అపరాధిని||

చరణం2. చిందితి రక్తము నాకై… పొందిన దెబ్బల చేత
అపనిందలు మోపితినయ్యో… సందేహమేలనయ్యా ||అపరాధిని||

చరణం3. శిక్షకు పాత్రుడనయ్యా… రక్షణ తెచ్చితివయ్యా
అక్షయభాగ్యమునియ్య… మోక్షంబుజూపితి వయ్యా ||అపరాధిని||

చరణం4. దాహంబు గొనగా… చేదు చిరకను ద్రావనిడితి
ద్రోహుండనై జేసితి… నీ దేహంబు గాయంబులను ||అపరాధిని||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area