Type Here to Get Search Results !

విలువైనది నీ ఆయుష్కాలం | Viluvainadi Nee Aayushkaalam

విలువైనది నీ ఆయుష్కాలం - Hema Chandra Lyrics

Singer Hema Chandra
Tune KY Ratnam
Music KY Ratnam
Song Writer KY Ratnam

పల్లవి:
విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2)
//విలువైనది//

చరణం1.
బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెతికినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము (2)
||విలువైనది||

చరణం2.
మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము(2)
//విలువైనది//



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area