సృష్టికర్తవైన యెహోవా - నీ చేతిపనియైన | Srustikarthavaina Yehova Lyrics | Telugu Christian Song Lyrics
Singer | Unknown |
Tune | Unknown |
Music | Unknown |
Song Writer | Unknown |
పల్లవి:
సృష్టికర్తవైన యెహోవా - నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ -
మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు -
నాలో నిన్నుచూసావు - నీలో నన్ను దాచావు -
నిస్వార్థమైన నీప్రేమ - మరణముకంటె బలమైనది నీప్రేమ
||సృష్టికర్తవైన||
చరణం1. ఏ కాంతిలేని నిశీధిలో - ఏ తోడులేని విషాదపు వీధులలో-
ఎన్నో అపాయపు అంచులలో- నన్నాదుకున్న నా కన్న తండ్రివి(2)
యేసయ్యా నను అనాథగా విడువక -
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2)
||సృష్టికర్తవైన||
చరణం2. నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా -
నశించిపోతున్న నన్ను వెదకివచ్చి- నన్నాకర్షించిన ప్రేమమూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి -
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి (2)
||సృష్టికర్తవైన||
Srushtikarthavaina Yehovaa
Nee Chethipaniyaina Naapai Endukintha Prema
Mantiki Roopamichchinaavu
Mahimalo Sthaanamichchinaavu
Naalo Ninnu Choosaavu
Neelo Nannu Daachaavu
Nisswaardhyamaina Nee Premaa
Maranamu Kante Balamainadi Nee Prema ||Srushtikarthavaina||
Ae Kaanthi Leni Nisheedhilo
Aer Thodu Leni Vishaadapu Veedhulalo
Enno Apaayapu Anchulalo
Nannaadukunna Naa Kanna Thandrivi (2)
Yesayyaa Nanu Anaathagaa Viduvaka
Neelaanjanamulatho Naaku Punaadulu Vesithivi (2) ||Srushtikarthavaina||
Nissaaramaina Naa Jeevithamulo
Nittoorpule Nannu Dinamella Vedhinchagaa
Nashinchipothunna Nannu Vedaki Vachchi
Nannaakarshinchina Premamoorthivi (2)
Yesayyaa Nanu Krupatho Balaparachi
Ullaasa Vasthramunu Naaku Dharimpajesithivi (2) ||Srushtikarthavaina||