Type Here to Get Search Results !

మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా - Manishiga Puttinodu | stevenson telugu christian songs lyrics

మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా - Dr. A.R. Stevenson telugu christian songs lyrics

Singer Dr. A.R.Stevenson
Tune Dr. A.R.Stevenson
Music Dr. A.R.Stevenson
Song Writer Dr. A.R.Stevenson

పల్లవి:
మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
మరల మంటిలో కలవవలయురా
తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా
ఇల సంపాదన వదలవలయురా (2)
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో (2)

చరణం1:
ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి
ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి (2)
క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు
స్వర్గానికి ఆయనతో వారసులౌతారు (2) ||మనిషిగా||

చరణం2:
జన్మనిచ్చినవాడు యేసు క్రీస్తు దేవుడే
జన్మించకముందే నిన్నెరిగిన నాథుడే (2)
ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే
నీ జన్మకు నిజమైన అర్ధముందిలే (2) ||మనిషిగా||

చరణం3:
నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు
చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు (2)
నీలోని ఆత్మకు స్వర్గమో నరకమో
నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరుచుకో (2) ||మనిషిగా||



Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.