Type Here to Get Search Results !

భీకరుని బాహుబలము తక్కువైనదా - Bheekaruni Bhaahubalam

భీకరుని బాహుబలము తక్కువైనదా - Dr. A.R. Stevenson telugu christian songs lyrics

Singer Dr. A.R.Stevenson
Tune Dr. A.R.Stevenson
Music Dr. A.R.Stevenson
Song Writer Dr. A.R.Stevenson

పల్లవి:
భీకరుని బాహుబలము తక్కువైనదా
నీకొరకు కార్యములను చేయలేనిదా || 2 ||
సహనము విడువకా - కనిపెట్టుకున్న మేలు జరుగదా ... సదా
యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||

చరణం1 . బలహీనత చెరలో విల-విలాడిన స్థితిలో
నీ మునుపటి సామర్థ్యం ఆవిరైనదా || 2 ||
సింహపు నోటికి తాళము వేసిన || 2 ||
దేవుని వాగ్దానం ధైర్యపరచదా || 2 ||

యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||
భీకరుని బాహుబలము తక్కువైనదా
నీకొరకు కార్యములను చేయలేనిదా

చరణం2. ఎదురొచ్చిన శ్రమలో - కలవరపెట్టిన భ్రమలో
నీయందలి విశ్వాసం అల్పమైనదా || 2 ||
సంద్రము మధ్యను -దారిని చూపిన || 2 ||
దేవుని వాత్సల్యం భద్రపరచదా || 2 ||

యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||
భీకరుని బాహుబలము తక్కువైనదా
నీకొరకు కార్యములను చేయలేనిదా

చరణం3. అనుమానపు శృతిలో - తెగులుతో తప్పిన జతిలో
నీకుండిన మాధుర్యం మాయమైనదా || 2 ||
ఎండిన యెముకలో జీవముపోసిన || 2 ||
దేవుని వాక్ శక్తి స్వస్థపరచదా || 2 ||

యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||

భీకరుని బాహుబలము తక్కువైనదా
నీకొరకు కార్యములను చేయలేనిదా || 2 ||
సహనము విడువకా - కనిపెట్టుకున్న మేలు జరుగదా ... సదా
యెహావాకసాధ్యం ఏదైనా ఉన్నదా- సహాయపడు తండ్రి ఆయనే గదా || 2 ||

భీకరుని బాహుబలము తక్కువైనదా
నీకొరకు కార్యములను చేయలేనిదా.................

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area