Type Here to Get Search Results !

దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా | Deenudaa Ajeyudaa Song Lyrics | Dheenuda Ajeyuda Lyrics | Hpsanna Ministries Songs

దీనుడా అజేయుడా - ఆదరణ కిరణమా - దీనుడా - అజేయుడా - ఆదరణ కిరణమా - Dheenuda Ajeyuda Lyrics - Hosanna Telugu Christian Songs Lyrics

దీనుడా - అజేయుడా - ఆదరణ కిరణమా

Song Nameదీనుడా - అజేయుడా - ఆదరణ కిరణమా
SingerBro. Jhon Wesly
ComposerHosanna Ministries Official
Lyrics Writer Bro. Jhon Wesly
MusicHosanna Ministries Official

దీనుడా - అజేయుడా - ఆదరణ కిరణమా

పల్లవి: 

దీనుడా - అజేయుడా - ఆదరణ కిరణమా

పూజ్యుడా - పరిపూర్ణుడా - ఆనంద నిలయమా

జీవదాతవు నీవని - శృతిమించి పాడనా

జీవధారవు నీవని - కానుకనై పూజించనా

అక్షయదీపము నీవే - నా రక్షణ శృంగము నీవే

స్వరార్చణ చేసెద నీకే - నా స్తుతులర్పించెద నీకే॥దీనుడా అజేయుడా॥

చరణం 1) 

సమ్మతి లేని సుడిగుండాలే - ఆవరించగా

గమనము లేని పోరాటాలే - తరుముచుండగా

నిరుపేదనైన నా యెడల - సందేహమేమి లేకుండా

హేతువేలేని - ప్రేమ చూపించి -సిలువ చాటునే దాచావు ॥2॥

సంతోషము నీవే - అమృత సంగీతము నీవే

స్తుతి మాలిక నీకే - వజ్ర సంకల్పము నీవే॥దీనుడా అజేయుడా॥

చరణం 2) 

సత్య ప్రమాణము నెరవేర్చుటకే - మార్గదర్శివై

నిత్య నిబంధన నాతో చేసిన - సత్యవంతుడా

విరిగి నలిగిన మనసుతో - హృదయార్చనే చేసెదా

కరుణ నీడలో - కృపా వాడలో -నీతో ఉంటే చాలయ్యా ॥2॥

కర్తవ్యము నీవే - కనుల పండుగ నీవేగా

విశ్వాసము నీవే - విజయ శిఖరము నీవేగా॥దీనుడా అజేయుడా॥

చరణం 3) 

ఊహకందని ఉన్నతమైనది - దివ్యనగరమే

స్పటికము పోలిన సుందరమైనది - నీ రాజ్యమే

ఆ నగరమే లక్ష్యమై - మహిమాత్మతో నింపినావు

అమరలోకాన - నీ సన్నిధిలో -క్రొత్త కీర్తనే పాడెదను ॥2॥

ఉత్సాహము నీవే - నయనోత్సవం నీవేగా

ఉల్లాసము నీలో - ఊహల పల్లకి నీవేగా॥దీనుడా అజేయుడా॥

YouTube Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area