ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా - Ps John Wesly- Hosanna Telugu Christian Songs Lyrics | Anandam neelone jesus songs

Singer | Ps John Wesly |
Singer | Ps John Wesly |
Music | Ps John Wesly |
Song Writer | Ps John Wesly |
పల్లవి:
ఆనందం నీలోనే ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా ,స్తోత్రర్హుడా ||2||
అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతునిలలో నీకోసమే సాక్షార్ధమై.
||| ఆనందం నీలోనే|||
చరణం1.
పదే పదే నిన్నే చేరగా- ప్రతిక్షణం నీవే ధ్యాసగా ||2||
కలవరాల కోటలో కన్నీటి బాటలో||2||
కాపాడే కవచంగా నన్ను ఆవారించినా,
దివ్య క్షేత్రమా- స్తోత్రగీతమా
|||ఆనందం నీలోనే|||
చరణం2.
నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్త్యము నీవని||2||
నీ సన్నిధి వీడకా సన్నుతించి పాడనా||2||
నీకొరకే ద్వజమెత్తి నిన్ను ప్రకటించినా
సత్య వాక్యమే- జీవ వాక్యమే
|||ఆనందం నీలోనే|||
చరణం3.
సర్వ సత్యమేనా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై||2||
లోక మహిమ చూడకా
నీ జాడలు వీడకా||2||
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం నా ఆశ్రయం
|||ఆనందం నీలోనే|||
Tags
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.