తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా - Dr John Wesly - latest telugu christian songs lyrics 2020
Singer | Dr John Wesly |
Composer | Dr John Wesly |
Music | Dr John Wesly |
Song Writer | Dr John Wesly |
పల్లవి: తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
తలవంచకు ఎప్పుడు – తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో – కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో
కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో – ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
1. చీకటిని వెనుకకు త్రోసి – సాగిపోముందుకే
క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది
రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే
క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే (2)
నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…
2. పెకలించు కొండలను- విశ్వాస బాటలొ
గెలవాలి యుద్ధ రంగంలో- దైవిక బలముతో
యేసుని కృప నీలోనే ఉంది -సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో (2)
నీవు కావాలి ఓ మాదిరి- నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
నీవు మండాలి ఓ జ్వాలగా- నీవు చేరాలి ఓ గమ్యము…