-->
Type Here to Get Search Results !

Nenunna Nee Thodantu Song Lyrics | నేనున్నా నీ తోడంటూ Song Lyrics

Nenunna Nee Thodantu Song Lyrics | నేనున్నా నీ తోడంటూ Song Lyrics | Telugu Christian Songs Lyrics

Nenunna Nee Thodantu
Details Name
Lyrics Writer Daniel Jafanya.ch
Vocals/Singer Bethel Army Team

నేనున్నా నీ తోడంటూ నను ధైర్యపరచినా నేస్తమా 2

నిరాశ నిసీధిలో నా చేయి నీవు విడువక 2

నను ధైర్యపరచితివి

యేసయ్య నీకే ఆరాధన - యేసయ్య నీకే ఆరాధన 2


దినమూ గడుచుట భారమైన వేళలో

నాకు ధైర్య మిచ్చి నన్ను బలపరిచితివి

పలువిధ శోధనలు కృంగదీసినప్పుడు

నీ కృపతో నన్ను నీవు నిలబెట్టితివి 2

నీకు లాగ చేయగలిగిన

దేవుడేవరు లేరు యేసయ్య

ఎలా నిన్ను విడిచిపెట్టను

నాకున్నదంత నీవే యేసయ్యా ( యేసయ్య నీకే )


ముగిసిన నా జీవిత ఆశలన్నిటిని

చిగురింప చేసినది నీవే కదా

ఓటమి అంచున పడియున్న బ్రతుకును

విజయపు బాటలో నిలబెట్టితివి 2

ఏ విలువా లేని నన్ను

నీ సొత్తుగా చేసుకుంటివి

నీవు నాకు తోడు ఉన్న

చాలునయ్యా ఈ జీవితం ( యేసయ్య నీకే )

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area