ANANDA KELI Song Lyrics | ఆనంద కేళి Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Joshua Shaik |
| Vocals/Singer | Sireesha B |
ఆనంద కేళి ఈ రేయి గాలి
దూతాళి కోటి రాగాల తోటి
ఉప్పొంగే నాలో ఏదో హాయి
గంతులేసే భూమి - గొంతు విప్పి పాడే
చల్ల గాలి కూడా సంతసించి ఆడే
నింగిలోని తార - ఎంత వింత చేసే
బెత్లెహేములోన - వచ్చి వాలిపోయే
సంతోషమే సమాధానమే లోకాన ఆర్భాటమే
ఆనందమే (ఇది)ఆశ్చర్యమే శ్రీయేసు నీ జన్మమే
02:55 దేవాది దేవుడే - పశుపాకలో
మరియమ్మ తనయుడై - జనియించెనే
మనపాప భారము - భరియింపగా
దీనాది దీనుడై - అరుదెంచెనే
ఆ గొల్ల గానాలే - ఊరంతా నిండెనే
ఆకాశ వీధుల్లో - సంబరాలు మ్రోగెనే
వేవేల దూతలు - స్తుతియించి పాడెనే
ఆ తూర్పు జ్ఞానులు - తలవంచి మ్రొక్కెనే
గంతులేసే భూమి - గొంతు విప్పి పాడే
చల్ల గాలి కూడా సంతసించి ఆడే
నింగిలోని తార - ఎంత వింత చేసే
బెత్లెహేములోన - వచ్చి వాలిపోయే
04:52 సర్వాధికారుడే - నరరూపిగా
నీ కొరకు నా కొరకు - ఇల వచ్చెనే
సమృధ్ధి జీవమే - మనకివ్వగా
రారాజు యేసుడే - దిగి వచ్చెనే
ఆనంద రాగాలే - గుండెల్లో పొంగెనే
సంగీత నాదాలే - అంబరాలు తాకెనే
క్రీస్తేసు ప్రేమతో - దిగులంత పోయెనే
మెస్సయ్య రాకతో - జగమంత వెలిగెనే
గంతులేసే భూమి - గొంతు విప్పి పాడే
చల్ల గాలి కూడా సంతసించి ఆడే
నింగిలోని తార - ఎంత వింత చేసే
బెత్లెహేములోన - వచ్చి వాలిపోయే
