-->
Type Here to Get Search Results !

Aalsyam Avuthundemo Kaani Song Lyrics | ఆలస్యం అవుతుందేమో గాని Song Lyrics

Aalsyam Avuthundemo Kaani Song Lyrics | ఆలస్యం అవుతుందేమో గాని Song Lyrics | Telugu Christian Songs Lyrics

Aalsyam Avuthundemo Kaani
Details Name
Lyrics Writer Calvary Christ Church
Vocals/Singer Calvary Christ Church

ఆలస్యం అవుతుందేమో గాని కార్యమైతే ఆగదు

శోధనలో నడుపునేమో గాని సువర్ణంగా మార్చును /2/

నమ్మదగిన దేవుడు మరచిపోవునా..

తన చిత్తం చేయకుండా ఊరకుండునా /2/

//ఆలస్యం అవుతుందేమో గాని//


అమ్మబడిన యోసేపుకు తోడై ున్న దేవుడు

ఐగుప్తుకు రాజును చేసి ఘనపరిచేను

అనాధయైన హదస్స భక్తిని చూచిన దేవుడు

రాణి అయిన ఎస్తేరుగా మార్చి హెచ్చింపజేసెను /2/

తగిన సమయమందు స్పందించే దేవుడు..

సమృద్ధి దీవెనలతో తృప్తి పరచువాడు /2/

// ఆలస్యం అవుతుందేమో గాని//


సింహపు బోనుల దానియేలును కాచిన దేవుడు

ఉన్నతమైన స్థానమందున వర్ధిల్లజేసెను

శద్రకు మెషకు అబెద్నగదోలతో అగ్నిలో నిలిచెను

అగ్నివాసన అయిన తగలక కాపాడెను ప్రభు/2/

తగిన సమయమందు స్పందించే దేవుడు..

సమృద్ధి దీవెనలతో తృప్తి పరచువాడు /2/

// ఆలస్యం అవుతుందేమో గాని//


నమ్మదగిన దేవుడు మరచిపోవునా…

తన చిత్తం చేయకుండా ఊరకుండునా…/2/

ఆలస్యం అవుతుందేమో గాని కార్యమైతే ఆగదు…

శోధనలో నడుపునేమో గాని సువర్ణంగా మార్చును..హు

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area