-->
Type Here to Get Search Results !

Nannu Viduvaledayya Song Lyrics | నను విడువలేదయ్యా Song Lyrics

Nannu Viduvaledayya Song Lyrics | నను విడువలేదయ్యా Song Lyrics | Latest Telugu Christian Songs Lyrics

 Nannu Viduvaledayya
Details Name
Lyrics Writer Manoj (MJ) Mathai
Vocals/Singer Manoj (MJ) Mathai

నను విడువలేదయ్యా నేను పారిపోయిన

వెదకినన్ను పట్టుకున్నావు

నీకుదూరమైనను నిను కాదనిపోయినా

వెంటాడి హత్తుకున్నావు //2//


నీ ప్రేమ నిత్యము వెంబడిస్తూనే ఉందయ్యా

నీ కృప నను విడువక కనికరిస్తూనే ఉందయ్యా //2//

వందనాలయ్యా యేసు వందనాలయ్యా

వందనాలయ్యా యేసు వందనాలయ్యా //2//


1

మొండిజీవితమేనాది మార్పుకోరనిది

అహంకారమెనాలో అలలై పొంగుచుండెను //2//

అన్నీ ఉన్నాయన్నా గర్వం

నీ మధుర స్వరం వినలేకపోయింది //2//

ఆకస్మాత్తుగా నా జీవితం అంధకారంలో పడిపోయింది

నా హృదయం ముక్కలై చెల్లాచేదురైపోయింది //2//


// నీ ప్రేమ నిత్యము //

2

గాడంధకారమే నన్ను నలువైపు చుట్టుకున్నది

బ్రతుకుతానన్న ఆశే లేకుండా క్రుంగజేసెను //2//

కన్నీళ్లతో మోకాళ్లపై కూర్చొని

మొరపెట్టి ప్రార్థించుచున్నాను //2//

ఆ చీకటి రోజుల్లో ప్రత్యక్షమయ్యావు దివ్య వెలుగులతో నను నింపెవు

నా స్థితిగతులే మార్చేసావు నూతన జీవం నాకిచ్చావు //2//


// నీ ప్రేమ నిత్యం //

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area