Nee Aatmatho Song Lyrics | నీ ఆత్మతో నను నడిపించయా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Vijay Kondapuram |
| Vocals/Singer | Allen Ganta Enosh Kumar Jerusha Joseph Vijay Kondapuram |
Verse 1
నీ ఆత్మతో నను నడిపించయా
నీ మార్గము నాకు చూపించయా
నీ సత్యము నాలో కలిగించయా
నీ చిత్తము నాయందు నెరవేర్చయా
Pre-Chorus1
నీ ప్రేమను చూపించయా
నీ స్వరము వినిపించయా
నీ సన్నిధిలోకి నను చేర్చయా
శుద్ధాత్మను కుమ్మరించయా
Chorus (x2)
కరుణించు దేవా
కృప చూపుమయ్యా
నా తోడు నీవై
నడిపించు యేసయ్యా
Verse 2
నీ సన్నిధి త్రోసివేసి పారిపోతిని
లోకాశలకు లొంగి పడిపోతిని
క్షయమైన ఆనందమునాశింతిని
నిను వదిలి నను నేను కోల్పోతిని
Pre-Chorus2
నా దోషములను కనుగొంటిని
నీ దయ కొరకు తపియించితిని
నీ ప్రేమ విలువ తెలుసుకొంటిని
తిరిగి నీవైపు నే తరలితిని
Chorus (x2)
కరుణించు దేవా
కృప చూపుమయ్యా
నా తోడు నీవై
నడిపించు యేసయ్యా
Bridge (x4)
నా స్థితిని గమనించి
కనికరమును చూపించి
నా వైపు పరుగెత్తి
కౌగిలిలో నను చేర్చి
Tag
నీ ప్రేమను చూపించితివి
నీ వాత్సల్యము దయచేసితివి
నీ రక్తముతో నను కడిగితివి
నిత్య రాజ్యములో చేర్చుకొంటివి
Final Chorus (x2)
ఇక నీ కొరకే నేను
జీవింతునయ్యా
నీ ప్రేమనే
ప్రకటింతునేసయ్యా
