-->
Type Here to Get Search Results !

Mahopakaarudaa Song Lyrics | మహోపకారుడా Song Lyrics I Joshua Shaik Songs

Mahopakaarudaa Song Lyrics | మహోపకారుడా Song Lyrics | Joshua Shaik Songs Lyrics

Mahopakaarudaa
Details Name
Lyrics Writer Joshua Shaik
Vocals/Singer Arunita Kanjilal

మహోపకారుడా - సజీవ దేవుడా

వరాల యేసయ్య - సదా స్తుతించెద

తరాలు మారిన యుగాలు దాటిన

నీ ప్రేమ శాశ్వతం నీ ప్రేమ అమృతం


1. ఆరాధ్య దైవమా - అపురూప బంధమా

నా హృదయ సీమలో- రవి కోటి తేజమా

ఎనలేని బాటలో - వెనువెంట నీడగా

బలహీన వేళలో - బలమైన కోటగా

ఉన్నావు తోడుగా - నా ప్రాణ స్నేహమై

కావాలి నీ కృపా - ఇల నాకు జీవమై

నా నీతి సూర్యుడా - నా యేసు దైవమా

నా జీవితాంతము - నను కాయు మేఘమా


2. నే కోరు సంపద - నీ ప్రేమ కౌగిలి

నీ జీవ వాక్యమే - నా క్షేమ లోగిలి

ఊహించలేనుగా - నీ చేతి కార్యము

వివరించలేనుగా - నీ గొప్ప త్యాగము

సీయోను సారధి - నీవేగ మాదిరి

విశ్వాస యాత్రలో - నా మంచి కాపరి

నా నీతి సూర్యుడా - నా యేసు దైవమా

నా జీవితాంతము - ఆధార దీపమా

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area