Nirantharam Nee Krupalone Song Lyrics | నిరంతరం నీ కృపలోనే Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Eerla Suresh |
| Vocals/Singer | Eerla Suresh |
ప : నిరంతరం నీ కృపలోనే జీవిస్తున్నాను ప్రభూ....
ప్రతిక్షణం నీ దయాలోనే నన్ను నడిపించు ప్రభూ.(2)
నీవు నాకుండగా నీవే నా అండగా..(2) /నిరంతరం /
చ : అలసిన నా ప్రాణానికి ఆదరణ నీవయ్య
అడుగులు తడబడగా ఆశ్రయం నీవయ్య....
గాయమైన గుండెకు మృదువైన స్వరమయ్యా..
గమ్యం తెలియని దారిలో మార్గ దర్శివయ్యా....
నిన్ను చూసిన క్షణమే భయం దూరమాయెను
నీతో నడిచే జీవితం పరలోకమాయెను./నిరంతరం/
చ: ఎడారి బ్రతుకులో జీవజాలమాయ్యవు
ఎన్నో నిరాశలలో నిరీక్షణనిచ్చావు
నిస్సహాయ వేళలో నీ చేయి చాపావు
నిన్నే నమ్మిన నన్ను ఎన్నడూ విడువలేదయ్యా
నీ ప్రేమ తాకిడిలో నా కన్నీరు ఆగెను
నీ నామ ధ్యానంలో నా హృదయం నిండెను
/నిరంతరం/
