Abhishekam Song Lyrics | అభిషేకం Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Joseph Abraham |
| Vocals/Singer | Joseph Abraham |
అభిషేకించితివే తలగా వుండుటకు
అభిషేకించితివే నీలా మారుటకు
అభిషేకించితివే ఆరాధించుటకు
అభిషేకించితివే నీ రాజ్యము కట్టుటకు
అభిషేకం ఆధ్యంతం అవసరం ఆయుధం
అభిషేకం అసమానం ఆశ్చర్యం సాహసం
అభిషేకం….
1వ చరణము:
అరణ్యములో ఆప్యాయతకు ఆదరణకు దూరమవ్వగా
ఆరాధనయే అలవాటుగా అనర్హునిగా నేనుండగా
ఆనంద తైలముతో అభిషేకించి - నిత్య నిబంధనను స్థాపించితివే ||
శాశ్వత కృపలతో నను దీవించి - నిత్య రాజ్యమును స్థిరపరచివే ||
స్థితిగతులను పరిస్థితులను మార్చిన అభిషేకం...
చీరకాలము నీ సన్నిధిలో నను నిలిపిన అభిషేకం
అభిషేకం గుర్తించే - ఘనపరిచే - స్థిరపరిచే
అభిషేకం తరములను దీవించి స్థాపించే
అభిషేకం(2)
2వ చరణము:
పిలచితివే ప్రతిష్ఠించితివే - ఘనసేవను చేయుటకు
కృపనిచ్చితివే కనిపించితివే నీ కాడిని మోయుటకు
యెండిన ఆకును చిగురింపజేసి - గడ్డివలె బహు విస్తరింపజేసితివే
నిన్ను ముట్టువాడు నా కన్ను ముట్టునని - నా పక్షము నిలచి జయమిచ్చితివే
వేదనలను వేడుకగా, మార్చిన అభిషేకం
శోధనలను - శోభాతీషయముగ ,మార్చిన అభిషేకం
అభిషేకం నడిపించే భోధించే బలపరిచే
అభిషేకం ప్రేమించే హెచ్చించే ముద్రించే
అభిషేకం (2)
Global restoration Global restoration Global restoration
We are called for global restoration
we are chosen for global restoration
we are anointed for global restoration
we are ambassadors of global restoration
అభిషేకం శాశించే , పాలించె ,శుద్ధాత్మ
అభిషేకం రాగల తరములను బలముగ నడిపే
అభిషేకం జనములపై రాజ్యముపై దేశముపై
అభిషేకం కడవరి మందిర మహిమను చూపించే అభిషేకం (2)
