-->
Type Here to Get Search Results !

Nenu Neethimanthudanu Song Lyrics | నేను నీతిమంతుడను Song Lyrics

Nenu Neethimanthudanu Song Lyrics | నేను నీతిమంతుడను Song Lyrics | Telugu Christian Songs Lyrics

Nenu Neethimanthudanu
Details Name
Lyrics Writer Mohan Jonah
Vocals/Singer Mohan Jonah

నేను నీతిమంతుడను - కాను దేవా

నీకు నమ్మకస్థునిగా - లేను యేసయ్యా

కరుణించి నన్ను బ్రోచి కాపాడినావు

ఏకాకినైన నాకు దిక్కు నీవైనావు //


యోబు జీవితంబు నందు - నీచుడనని పలికాడు

పౌలు జీవితంబు నందు - దౌర్భాగ్యుడనన్నాడు

ఎంత సేవ చేసినా - ఎంత ఏడ్చినా -2

నీదు పాద ధూళిలోన - మొఖము దాచుకున్నారు -2 //


నన్ను వెంబడించువారు - నా శిష్యులు అవుతారు

నన్ను విసర్జించువారు - అపవాదికి అనుచరులు

యేసు అన్న మాటలో - ఎంత మర్మమో

క్రీస్తు లేని క్రైస్తవం - ఎంత ఘోరమో

బ్రతుకులోన మార్పు కోరి - నన్ను చేరదీసావు -2 //


నీదు నీతి వాక్యమందు - నను నీతిగ మలచావు

నీతి లేని జీవితాన్ని - సిలువలో క్షమించావు

నేను నీకు సొంతము - జీవితాంతము

నీదు ప్రేమ కావ్యము - పరమగీతము

నీచమైన నా గుణాన్ని - ప్రేమతో సహించావు -2 //

Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area