Sowndaryapurnudaa Song Lyrics | సౌందర్యపూర్ణుడా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Hosanna |
| Vocals/Singer | Hosanna |
సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా
రమ్యమైన పాలకా గొప్ప రక్షణా కారకా
యేసయ్యా నా ప్రాణప్రియుడా
మనస్సంతా నిండిన మధురాను బంధమా
అతిప్రియుడా నా ప్రాణేశ్వరా
అపురూపమే నీ ముఖదర్శనం
మనసారా నిన్నే చేరి
ప్రియమారా నిన్నే కొలిచి
ప్రణుతింతును ఆశతీరా అతికాంక్షణీయుడా
సద్భక్తితో బ్రతుక ఆశించగా
వాగ్ధాన ధ్వనులే బలపరచెను
విశ్వాసయాత్ర కడగండ్ల పాలైననూ
కన్నీటి కడలి చెలరేగి పొంగిననూ
నీవే నిమ్మళపరచినావు
మరిశ్రేష్ఠమైన యీవులను దయచేయ
నీ కరుణచూపి నా కొసగినావు
సమృద్ధి జీవము నా కొరకే తెచ్చితివి
సమీపించలేని నీ మహిమకై పిలిచిన
మహిమోన్నతుడా యేసయ్యా
త్వరలో రానైయున్న నా ప్రియుడవు
కను రెప్పపాటున నిను చేరెదను
కనులార నిను చూసి మైమరిచిపోయే
కనువిందు చేసే మహిమానగరిలో
పరవశమే ప్రతినిత్యము
