Israelu kaapari Song Lyrics | ఇశ్రాయేలు కాపరి Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Hosanna |
| Vocals/Singer | Hosanna |
అబ్రహాము నమ్మిన దేవుడా
నా పితరుల ఆరాధ్య దైవమా (2)
ఇశ్రాయేలు కాపరి – బహుగొప్ప నేర్పరి
నీకు సాటియెవరు యేసయ్యా (2)
సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా
ప్రభాకరుడా బహు బలవంతుడా (2)
సత్యవంతుడా మహాపరిశుద్ధుడా
ఆరాధనకు యోగ్యుడా
చరణం :- 1
నీలి మేఘమును నీడగా మార్చి
అగ్ని స్థంభమును కాంతిగా నిలిపి (2)
సైన్యములకు నీవే సారధిగా నిలిచి
నింగినంటిన గోడలు కుప్పగా కూల్చిన (2)
మా పక్షమైయున్న – మహారాజువు నీవే
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
( సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా )
చరణం :- 2
నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై
నిరాశల నీడను తొలగించెదవు (2)
విస్తారమైన నీ కృపలతో నింపి
నిస్సారమైన బ్రతుకును మార్చెదవు (2)
విజయోత్సవముతో ఊరేగించెదవు
నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా
( సహాయకుడా నిత్యస్తోత్రార్హుడా )
చరణం :- 3
సాత్వీకముతో – దీర్ఘశాంతముతో
విసుగక నాయెడల వాత్సల్యము చూపి (2)
ఒంటరిగా నను ఎన్నడు విడువక
వేదనలో నను దాటి వెళ్లక (2)
తల్లివలె ఒడిలో లాలించువాడవు
తీరని నీ రుణము వివరింపతరమా
( అబ్రహాము నమ్మిన )
