NAA PAATALOO PALLAVI Song Lyrics | నా పాటలో పల్లవి Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Bro. Shalem Raj |
| Vocals/Singer | Bro. Shalem Raj |
ఆరాధన నీకే దేవా
ఆనందము నీవే కావా (2)
నా పాటలో పల్లవి
ఆశల జల్లువి
నీవేగా నా యేసయ్యా (2) //ఆరాధన నీకే దేవా///
1.ఆత్మీయ పోరాటంలో
ఎదురయ్యే ఒడిదుడుకులలో (2)
ఎడబయలేదు క్షణమైన నీవు
ఏ వేళనైనా నను విడిపోవు (2) (నా పాటలో...)
// ఆరాధన నీకే దేవా///
2.నా కనుల కన్నీరు తుడిచి
నీ ప్రేమ కౌగిట చేర్చి (2)
అపురూపమైన అనుభవము చూపి
నన్నదరించినా నా యేసయ్యా (2) (నా పాటలో..)
//ఆరాధన నీకే దేవా//
3.నాలోన నను తొలగించి
నీ వశములో నన్ను నిలిపి (2)
నాలోన చేరి నా హృదయమేలి
నను వాడుకోనుము నా యేసయ్యా (2). (నా పాటలో..)
//ఆరాధన నీకే దేవా//
