Mamu Balaparachuvadu Song Lyrics | మము బలపరచువాడు Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Bro. V. Yesepu |
| Vocals/Singer | Baby |
మము బలపరచువాడు క్రీస్తే
మాకు బహుమానమిచ్చేను యేసే//2//
ఊహించలేని హృదయానందము దయచేసినావయా
మాపై చూపినకృపను వర్ణించలేమయా
నీవు మాపై చూపినకృపను వర్ణించలేమయా
క్రీస్తే మా ఆరాధ్యుడూ
క్రీస్తే పూజార్హుడూ
క్రీస్తే మా నాధుడు
క్రీస్తే సహాయకుడు //2//మము//
చరణం - 1
నిందనే పూదండగా మార్చినావు మా యేసయా
కన్నీటినే నాట్యముగా చేసినావు నీవేనయా //2//
క్రీస్తే మా దైర్యము
క్రీస్తే మా శౌర్యము
క్రీస్తే మా సౌఖ్యము
క్రీస్తే మా సమస్తము //2//
చరణం - 2
సమూయేలు వలే ఈ బహుమానము ఎదగాలయా నీ కోసము
ఇస్సాకులా మా సంతానము బ్రతకాలయా నీకోసము
యోసేపు వలే మా బిడ్డను ఫలియింపచేయుము నీకోసము
బాప్తీస్మమిచ్చే యోహానులా ఎదగాలయా నీకోసము
నీకోసమే ఎదిగించయా
నీసాక్షిగ బ్రతింకించయా
నీ చిత్తము నేర్పించయా
నీ భయములో బ్రతికించయా //2//
మము బలపరచువాడు క్రీస్తే
మాకు బహుమానమిచ్చింది యేసే//2//
ఊహించలేని హృదయానందము దయచేసినావయా
మాపై చూపిన కృపను వర్ణించలేమయా
నీవు మాపై చూపిన కృపను వర్ణించలేమయా
క్రీస్తే మా ఆరాధ్యుడూ
క్రీస్తే పూజార్హుడు
క్రీస్తే మా నాధుడు
క్రీస్తే సహాయకుడూ
క్రీస్తే మా దైర్యము
క్రీస్తే మా శౌర్యము
క్రీస్తే మా సౌఖ్యము
క్రీస్తే సమస్తము //2//
