Hrudaya Simhasanam Song Lyrics | హృదయ సింహాసనం Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Mrs.Jnana Prasanna Venu |
| Vocals/Singer | Mrs.Jnana Prasanna Venu |
హృదయ సింహాసనం పదిలపరచితిని
రారాజు నా యేసుడే ఆసీనుడవ్వాలని
నా ఆత్మ నాలో ఉప్పొంగగా
నా హృదయసీమ హర్షించగా ఆనందగానాలతో
స్తుతి సంగీత సామ్రాజ్యమై
1. అవునన్ననూ కాదన్ననూ
విధి నిర్ణయములో సాగాలనే పొరపాటునో తడబాటులో
ఆ పరిధి దాటి పోరాదునే
మేలైన పసిడి పుటమందెగా శోధింపవెండి స్వచ్చంబెగా
నేనట్లు మారాలని ఆ...
నీ కిష్టమవ్వాలని
2.అణచబడిననూ అనుకువ నేర్చి - మరువబడిననూ -
మలచుట కోర్చి, నలుగగొట్టినా తైలము నిచ్చి -
పిండబడినను పరిమళమిచ్చి
ఓ కుమ్మరీ నీ సారెపై -
యజమాని వాడుకొనే ప్రీతి పాత్రనై సంసిద్ధమవ్వాలని -
సంతృప్తి నొందాలని
3.పరుగెత్తినా గురిచూడక గెలుపొందినా దరిజేరక
గురి యొద్దకే పరుగెత్తుటకు -
దరి చేరుటకే గెలుపొందుటకు ఆత్మీయ పరుగు
నేర్పించుమా - అద్దరికి నన్ను నడిపించుమా
నీ ఒడిని చేరాలని - ఆ...
విశ్రాంతి నొందాలని
