-->
Type Here to Get Search Results !

ANUKONUTA NERPAYYA Song Lyrics | ఆనుకొనుట నేర్పయ్య Song Lyrics

ANUKONUTA NERPAYYA Song Lyrics | ఆనుకొనుట నేర్పయ్య Song Lyrics | Telugu Christian Songs Lyrics

ANUKONUTA NERPAYYA
Details Name
Lyrics Writer SUNDER P
Vocals/Singer SIS JESSY D

ఆనుకొనుట నేర్పయ్య – ఆదుకొనే యేసయ్య

ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన (2)

నీవే చెయ్యాలయ్యా కార్యం -నీవే చూపాలయ్యా మార్గం

నిన్నే నమ్ముకున్నాను- వేరే దారి లేదయ్యా

|| ఆనుకొనుట నేర్పయ్య ||


ఈ లోక యాత్రలో – కానను బాటలో

నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా

పిలిచినా స్నేహమా – ఏర్పరిచిన దైవమా (2)

పర్వతములన్ని దాటించుటకు చాలిన హస్తమా (2)

|| ఆనుకొనుట నేర్పయ్య ||


నా బాల్యస్నేహమా-నా గుండె దైర్యమా

గోతిలోనుండి లేవనెత్తి నను నిలిపిన దైవమా

నా క్షేమ క్షే త్రమా, నా హృదయ గీతామా (2)

మనుష్యుల మాయోపాయమునుండి తప్పించు జ్ఞానమా (2)

|| ఆనుకొనుట నేర్పయ్య ||


నా పాప జీవితం -చంచల వర్తనం

క్రీస్తు సిలువ రక్తముతో- కడిగి ముద్ర వేసావయా

నా భక్తి కాదయా కృప మాత్రమేనయా (2)

కడవరకు నమ్మకముగా సాగే కృపనిమ్ము యేసయ్య (2)


ఆనుకొనుట నేర్పయ్య – ఆదుకొనే యేసయ్య

ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన (2)

నీవే చెయ్యాలయ్యా కార్యం -నీవే చూపాలయ్యా మార్గం

నిన్నే నమ్ముకున్నాను- వేరే దారి లేదయ్యా



Watch the Song Video

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Area