అయిదు రొట్టెలు రెండు చిన్న Song Lyrics | Iyidu Rottelu Rendu Chinna Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | VIJAYA PRASAD |
| Vocals/Singer | NAYANA |
పల్లవి:
అయిదు రొట్టెలు రెండు చిన్న చేపలు
అడిగినంతనే ఇచ్చెను చిన్నబాలుడు
పంచినవన్నీ క్రీస్తు శక్తి వలన కలిగెను
ఆయినా సహకారం ఆయన ఎందుకు అడిగెను?
మిగిలినవన్నీ పన్నెండు గంపలాయెను
సేవలో సహకారిగా చిన్నవాడు నిలిచెను
సత్ర్కియ నేర్పించే పాఠం ఇది సోదరా
ఉత్సాహముగా ఇచ్చే మనసుండాలిరా
ఇచ్చే గుణం దేవుడు మెచ్చే గుణం
పంచే గుణం ఆయన ఆశీర్వచనము
చరణం:1
బర్నబాకు పొలముంది..కళ్ళముందు పని ఉంది
ఆదరించు గుణం ఉంది.. అక్కర కనబడుతుంది
సంఘము శ్రమలలో ఉంది.. సువార్త పని మిగిలుంది
లోకము బెదిరిస్తుంది..కరువు ఎదురుగా ఉంది
పొలమును అమ్మి ప్రభువు పరిచర్యకు ఇచ్చాడు
ధనమును అపోస్తలుల పాదము ముందు ఉంచాడు
సిరికంటే ఘనముగా దేవుని ప్రేమించాడు
ఆదరణ పుత్రుడని బిరుదు పొందుకున్నాడు
సమృద్ధిగా విత్తుట దీవెనకరం
విస్తారంగా కోయుట ఆశీర్వాదం (2) ॥అయిదు॥
చరణం:2
ప్రభువు ఆకలి అన్నారు..ఆహారమిచ్చారు
ప్రభువు దప్పిగొన్నారు..మీరు దాహమిచ్చారు..
పరదేశిగా ఉన్నారు మీరు చేర్చుకున్నారు
రోగముతో ఉన్నప్పుడు మీరు ఆదరించారు..
మిక్కిలి అల్పులైన ఒకనికి మీరు చేశారు
ప్రభువుకు చేసినట్టు ఆయన మెప్పు పొందారు
అక్షయ ఆహారం ఆత్మలకు అందించారు
రక్షణ వస్త్రమును వస్త్రహీనులకిచ్చారు
పూర్ణఔదార్యం ఇచ్చును జీవకిరీటం
వారికిమాత్రం సిద్దము దేవునిరాజ్యం (2) ॥అయిదు॥
