Ontarini Kaanu Song Lyrics | ఒంటరిని కాను Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Mrs Blessie Wesly |
| Vocals/Singer | Mrs Blessie Wesly |
ఒంటరిని కాను - నీవు తోడుండగా
విడువబడలేదు - నా దేవా నీవుండగా
నా ఆదరణ నీవే - నా ఆశ్రయము నీవే
ఆలంబన నీవే - ఆనందము నీవే
ఏకాకినైన నా బ్రతుకులో - సెలయేరై పారెనే నీ ప్రేమ
కన్నీటి కడలిలో నేనుండగా - ఓదార్పువై దరి చేరావుగా
వ్యధలన్ని తీర్చి - నా స్థితిని మార్చి
ఆనందమిచ్చిన నా దైవమా
వ్యధలన్ని తీర్చి - నా స్థితిని మార్చి
ఆనందమిచ్చిన నా యేసయ్య
ప్రియులైన వారే విడనాడినా - నా పక్షమై నీవు నిలిచావుగా
గాఢాంధకారము నన్ను చుట్టిన - అరుణోదయముగా వచ్చావుగా
నన్ను చేరదీసి - గాయములను మాన్పి
ఆధారమైన నా దైవమా
నన్ను చేరదీసి - గాయములను మాన్పి
ఆధారమైన నా యేసయ్య
