VAAKYAME SAREERA DHAARIYAI Song Lyrics | వాక్యమే శరీరధారియై Song Lyrics | Telugu Christmas Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Dollie Rose |
| Vocals/Singer | Akshaya Praveen |
వాక్యమే శరీరధారియై ఈ భువికేయెతెంచెను
దేవుడే దివ్య రూపమై పసిబాలునిగా జన్మియించెను
సర్వాధికారి యేసుడే దీనుడిగా దిగివచ్చెను
ఆదియందున్న వాక్యమే వెలుగై ఉదయించెను
నిసస నిసస నిసస నిసస నిరిగరిగరిని
నిరిరి నిరిరి నిరిరి నిరిరి పమపగరినిస
ఈ దినం శుభ దినం యేసు రాజు పుట్టే మరియకు
ప్రతి దినం సునాదము చేయుదము రారాజుకు
1) దైవ కుమారుడు మనుష్య కుమారునిగా మహిలో నివసించెను
ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు ఇమ్మనుయెలుగా ఉధ్బవించెను
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు
నీలో నివసించుటకు సింహాసనమునే విడిచెను
2) మహిమస్వరూపుడు ఆదిసంభూతునిగా ఇలలో పిలువబడెను
ఆ మహిమను విడిచిన దేవుడు నీకై శిశువుగా మార్చబడెను
నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అయిన దేవుడు
సర్వసృష్టికర్త మానవరూపిగా జన్మియించెను
