Siddhame Song Lyrics | సిద్ధమే ప్రభువా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Rev.P.Rambabu |
| Vocals/Singer | Dinesh |
పల్లవి: సిద్ధమే ప్రభువా నీ కొరకై నీ దాసుడు
సంసిద్ధమే దేవా పరిచర్యకై నీ సేవకుడు (2)
అ.ప: బలపరచుమునీ సేవలో
నడిపించుము నీ త్రోవలో(2)
నన్ను నడిపించుము నీ త్రోవలో ||సిద్ధమే||
చరణం(1): భారమేమో అధికమాయే బలమేమో చాలదాయే
మనసేమో బరువాయి ఆదరణే కరువాయే
బలపరచుమునీ సేవలో
నడిపించుము నీ త్రోవలో(2)
నన్ను నడిపించుము నీ త్రోవలో ||సిద్ధమే||
చరణం(2) : హృదయములో వేదనాయే నశియించే ఆత్మలకై
తృష్ణ నాలో తీవ్రమాయే నీ సిలువను చాటింపను(2)
బలపరచుమునీ సేవలో
నడిపించుము నీ త్రోవలో(2)
నన్ను నడిపించుము నీ త్రోవలో ||సిద్ధమే||
చరణం(3): దహియించుము నన్ను ఆత్మతో వెలిగింపను ఈ జగతిని
మండించుము నన్ను అగ్నితో మారెదను సమీదనై
బలపరచుమునీ సేవలో
నడిపించుము నీ త్రోవలో(2)
నన్ను నడిపించుము నీ త్రోవలో ||సిద్ధమే||
