Neethike Aadhaarama Song Lyrics | నీతికే ఆధారమా Song Lyrics | Telugu Christian Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Dr. A.R.Stevenson |
| Vocals/Singer | Dr. A.R.Stevenson |
నీతికే ఆధారమా - వెలుగైన మనుష్యావతారమా
భువిపైన కాలిడిన ప్రేమ స్వరూపమా
సోలిన ప్రాణ ధైర్యమా - అణగారిన వారి క్షేమమా
నలిగిన వారికి విమోచనమా
అప.. జనించిన దైవమా
వరించిన భాగ్యమా నీవే నా సర్వమా
1. దూతలచే స్తుతిగానం - సింహాసన సౌభాగ్యం
త్యాగము చేసి దీనుడవై దిగివచ్చిన పరమాత్మా
పాపుల రక్షణార్థమై నీకు ఇంత దీనత్వమా
2 . అన్నిటిపై అధికారం - బంగారపు సామ్రాజ్యం
తృణముగ ఎంచి బాలుడవై పవళించిన పరమాత్మా
నీచులతోటి శ్రేష్ఠుడ నీవు కోరి సాంగత్యమా
