ఒక క్షణమైనా Song Lyrics | Okka Kshanamaina Song Lyrics | Telugu Calvary Songs Lyrics
| Details | Name |
|---|---|
| Lyrics Writer | Dr.P.Satish kumar |
| Vocals/Singer | Bro.Suhaas Prince |
నువ్వులేని నన్ను ఊహించలేను నిన్ను వీడి నేను ఉండలేనే..
నాలోనే నిన్ను నే దాచుకున్నాలే.. నాకంటూ ఉన్నది నీవేలే..
నీలోనే నన్ను చూసి నాలోనే నిన్ను చూపే నీలాంటి మనసు నాకు ఇచ్చావే..
ఓ ఓ ఓ ఓ.. యేసయ్యా నీకే మహిమా.. ఘనత..
1. నువ్వులేని నా జీవితాన్ని ఊహించలేనయ్యా
నువ్వులేని ఒక క్షణమైనా నేనుండలేనయ్యా
నీకోసమే నాజీవితం అంకితం యేసయ్యా
నీ ప్రేమనే జీవితాంతము చూపెదనేనయ్యా
నీవెంట నే నిత్యము నేను నడిచెదనేసయ్యా
నాకంటు ఈ లోకాన ఉన్నది నీవయ్యా ఆ ఆ ఆ ఆ..
నీలోనే నన్ను చూసి నాలోనే నిన్ను చూపే నీలాంటి మనసు నాకు ఇచ్చావే..
ఓ ఓ ఓ ఓ.. యేసయ్యా నీకే మహిమా.. ఘనత..
2 . నాయెడల నీ నమ్మకాన్ని వొమ్ముచేయ్యనయ్యా
నీ చిత్తమే నాకు క్షేమము ఇలలో యేసయ్యా
నీరాకకై నా ప్రాణము వేచి వున్నదయా
నీ రాజ్యమే నా గమ్యము నిరతము యేసయ్యా
నా ఊహలకందదు నీప్రేమ యెన్నడు యేసయ్యా
నా వర్ణనకందని నీత్యాగం చేసావేసయ్యా
నీలోనే నన్ను చూసి నాలోనే నిన్ను చూపే నీలాంటి మనసు నాకు ఇచ్చావే
ఓ ఓ ఓ ఓ.. యేసయ్యా నీకే మహిమా.. ఘనత..
