Teerani Vedanatho Song Lyrics | తీరని వేదనతో Song Lyrics | Telugu Christian Songs Lyrics

తీరని వేదనతో-రగిలే గుండెలతో
మాడిన కడుపులతో- పగిలిన పాదముతో
అలసిన ముఖములతో-ఆగిన స్వరములతో
రోదన ధ్వనులతో-కఠికుపవాసముతో
బ్రతుకులు కట్టిన సేవకులారా మీకే నా వందనము
సువార్తకై పరుగులు పెట్టిన మీ పాదములే సుందరము
చరణం -1
చీకటి లోయలలో వెలుగును నింపుటకు
రక్కసి మూక యొద్ద తనువులు విడిచారు
మా రాతి గుండెలను బద్దలు కొట్టుటకు
అవమానాన్నే ఆనందించారు
మీలో రగిలిన ప్రసవ వేదనే
మాలో కలిగించెను ఈ స్పందనే
ఎందరినో మార్చిన మీ వేదన-
చెరిపెను ఆ దేవుని ఆవేదన
చరణం - 2
గర్జించు సింహమువలే అపవాది తిరగగా
వాడినుండి కాపాడే వాక్యము చూపారు
లోకపు మాయలో మేము పడకుండా
లోకాన్ని జయించిన ప్రభువుని చూపారు
కన్నీటి అనుభవమే విశ్వాసి ఆయుధమని
యేసే శరణమని ఆయన కొరకు బ్రతకమని
మాకై తలపించి మీ తనువులు విడిచారు.
**********************************************
YRICS & PRODUCED : RAYAPUDI DAVID