Prathi Bhaspa Binduvunu Song Lyrics | ప్రతి భాష్ప బిందువును Song Lyrics | Telugu Christian Songs Lyrics

పల్లవి: ప్రతి భాష్ప బిందువును తుడుచుట కొరకు
ఘనుడైన యేసయ్యా వచ్చియుండె మన కొరకు
మన పాపశాపాములు భరియించుటకు
న్యాయాధిపతి యేసే అరుదించెను
మనకోసమే మనకోసమే....యేసు బలియాయెను
1. నీ దుఃఖ దినములను సమాప్తములుచేసి
అనందతైలముతో అభిషేకించి
ఉల్లాస వస్త్రములు నీకిచ్చెనూ
కన్నీటి దినములను నాట్యముగా మార్చెను
2. పాపమనే చెర నుండి నిను విడిపించి
దాస్యత్వములో నుండి నిను తప్పించి
నీ పాపభారాన్ని తాను మోసెనూ
మనకొరకు యేసయ్యా యాగమాయెను
3.ఆఖరి రక్తపు బొట్టు నీకొరకే చిందించి
సొగసైన స్వరూపమైన లేనివానిగా మారి
తుదిశ్వాస వరకు నీకై తపియించెనూ
సిలువలోన నీ శిక్ష కొట్టివేసెనూ
*********************************************
Lyrics & Tune by Krupasana Ministries
Vocals Anwesshaa