Etu Thochaka Vunnadi Song Lyrics | ఎటు తోచక ఉన్నది Song Lyrics | Telugu Christian Songs Lyrics

ఎటుతోచక ఉన్నది - కలవరం కలుగుచున్నది
నాస్థితిని తలచగానే - భయము నాకు పుట్టుచున్నది "2"
యేసయ్యా...ఆలోచ నకర్తవు నీవయ్యా...
యేసయ్యా...సమాధాన కర్తవు నీవేనయ్యా... "2".
//ఎటు//
1). ముందు వెళ్ళలేను వెనుదిరుగలేను
ఏటుతోచని స్థితిలోనే నిలిచానయ్యా "2"
చుక్కాని నీవై నన్ను నడిపెదవు
ఆగమ్య స్థానానికి చేర్చెదవు "2"
యేసయ్యా... నామర్గము నీవేనయ్యా
యేసయ్యా... నా గమ్యము నీవెనయ్య "2"
//ఎటు//
2).అందకరమేమో ముందునిలిచినయ్యా
అంతులేని వేదనలో అలుముకున్నవి "2"
నా జీవన వెలుగై నాతోడుండి
మహిమా రాజ్యంలో చేర్చేదవు "2"
యేసయ్యా...నావెలుగు నీవెనయ్యా
యేసయ్యా...నా దైర్యము నీవనయ్యా...."2"
//ఎటు//
3). గుండె పగులు వేల గొంతుమూగబోయే
ఉప్పెనలా కన్నీళ్లు ఉబుకుచున్నవి "2"
నన్ను ఓదార్చే నాకన్నతండ్రివై
కౌగిలిలో నెమ్మదిని నాకిచ్చేదవు "2"
యేసయ్యా...అమ్మ నాన్న నీవేనయ్యా
యేసయ్యా...తోడు నీడ నీవేనయ్యా. "2"
//ఎటు//