Emivvagalanu Nee Premakai Song Lyrics | ఏమివ్వగలను నీ ప్రేమకై Song Lyrics | Telugu Christian Songs Lyrics
ఏమివ్వగలను నీ ప్రేమకై
అర్పింతునయ్యా నా బ్రతుకును ||2|| ||ఆదరించు||
(1) చితిగా మారిన నా జీవితమును
చిగురింప చేసిన నా యేసయ్యా||2||
ఫలియించు ద్రాక్షావల్లిగా
నీ సంఘములో స్థిరపరచినావే ||2|| ||ఏమివ్వగలను||
(2) రేగిపోయిన నా గూడును
నీ శిలువ నీడలో నిర్మించినావే ||2||
బలిపీఠముపై నే గువ్వగా
నైవేధ్యమౌదును నీ సాక్షిగా ||2|| ||ఏమివ్వగలను||
(3) ఎన్నడు పాడని ఓ క్రొత్త గీతం
నీ సన్నిధిలో పాడెదనయ్యా ||2||
హల్లేలూయా స్తుతిగానాలతో
ఘనపరచెదనయ్యా నీ మహిమను ||2|| ||ఏమివ్వగలను||
*********************************************
Lyrics & Vocals : V. Anil Kumar